Madanapalle: ట్రాఫిక్ నివారణకు రోడ్డు ఆక్రమణల తొలగింపు
Madanapalle: మదనపల్లెలో ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు డీఎస్పీ బుచ్చిరాజు ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్ జంక్షన్ నుంచి నిమ్మనపల్లె జంక్షన్ వరకు ఆక్రమణలు తొలగించారు.
Madanapalle: ట్రాఫిక్ నివారణకు రోడ్డు ఆక్రమణల తొలగింపు
మదనపల్లె: పట్టణంలో రహదారి ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని పోలీసులు చేపట్టారు. డీఎస్పీ బుచ్చిరాజు ఆధ్వర్యంలో ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా, ఎస్సై గాయత్రి సిబ్బందితో కలిసి మంగళవారం ఎన్‌టీఆర్ జంక్షన్ నుంచి నిమ్మనపల్లె జంక్షన్ వరకు రహదారి వెంట ఉన్న ఆక్రమణలను తొలగించారు.
రహదారులపై ఆక్రమణల కారణంగా వాహనాల రాకపోకలకు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ప్రధాన రహదారులపై ఆక్రమణలు చేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.
Next Story




