Madanapalle: మదనపల్లె వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థిగా జింకా చలపతి!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ చైర్మన్ వైయస్సార్‌సీపీ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన జింకా చలపతి పేరును అధిష్టానం ఖరారు చేసింది.

Srinivasulu, Madanapalle
Published on: 15 Oct 2026 10:33 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థిగా జింకా చలపతి!

Madanapalle: మదనపల్లె మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున జింకా చలపతి పేరును పార్టీ అధిష్టానం అధికారికంగా ఖరారు చేసింది. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది.

పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్మన్‌ అభ్యర్థులతో పాటు కార్పొరేషన్ల మేయర్‌ అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది.

మదనపల్లె మున్సిపల్‌ చైర్మన్‌ స్థానం బీసీలకు రిజర్వు కావడంతో బీసీ (బోయ) సామాజిక వర్గానికి చెందిన జింకా చలపతికి పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది.

ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించడంతో స్థానిక వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ విజయానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle