Madanapalle: ఆన్‌లైన్ 1-బీ పేరుతో భూ ఆక్రమణ యత్నం.. బాధితుడి ఆవేదన
Madanapalle: అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో భూ అక్రమణ కలకలం.
Madanapalle: ఆన్‌లైన్ 1-బీ పేరుతో భూ ఆక్రమణ యత్నం.. బాధితుడి ఆవేదన
Madanapalle: అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం నారిగానిపల్లి పంచాయతీ కమ్మవారిపల్లికి చెందిన టి. గుణశేఖర్ (తండ్రి: గంగాధర్) తన భూమికి సంబంధించిన వివాదంపై మదనపల్లె ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి తన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన మాట్లాడుతూ.. స్థానికులు రంగారెడ్డి, నాగరాజు, పురుషోత్తం, శ్రీనివాసులు వారి వద్ద నుంచి సర్వే నెంబర్లు 270-2, 270-8, 270-10లో ఉన్న భూమిని కొనుగోలు చేశామని తెలిపారు. 2015 సంవత్సరం నుంచి ఆ భూమి తమ ఆధీనంలోనే ఉందని, అయినప్పటికీ పలుమార్లు రెవెన్యూ అధికారులను సంప్రదించినా ఇప్పటి వరకు భూమిని ఆన్‌లైన్‌లో నమోదు (1-బీ) చేయలేదని ఆరోపించారు.
అయితే వెంకటరమణ అనే వ్యక్తి తమ భూమిని తన పేరుపై ఆన్‌లైన్ 1-బీ చేసుకుని, ఆ భూమి తనదేనంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని గుణశేఖర్ ఆరోపించారు. రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులను ప్రభావితం చేస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు.
ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి, భూమికి సంబంధించిన అసలు రికార్డులను పరిశీలించి తమకు న్యాయం చేయాలని గుణశేఖర్ ప్రభుత్వాన్ని కోరారు.




