Madanapalle: మదనపల్లె అభివృద్ధి కూటమి పాలనతోనే సాధ్యం: రాటకొండ గురుప్రసాద్

Madanapalle: మదనపల్లె సమగ్ర అభివృద్ధి, హార్టికల్చర్ హబ్ స్థాపన కూటమితోనే సాధ్యమని, చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబును గెలిపించాలని రాటకొండ గురుప్రసాద్ పిలుపునిచ్చారు.

Srinivasulu, Madanapalle
Published on: 30 Oct 2026 4:47 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె అభివృద్ధి కూటమి పాలనతోనే సాధ్యం: రాటకొండ గురుప్రసాద్

మదనపల్లె: మదనపల్లె సమగ్ర అభివృద్ధి కూటమి పాలనతోనే సాధ్యమని ఎస్వీయూ మాజీ సెనేట్ సభ్యుడు రాటకొండ గురుప్రసాద్ పేర్కొన్నారు. దశాబ్దాలుగా మదనపల్లె ప్రజలు ఎదురుచూస్తున్న జిల్లా ఏర్పాటు కలను సాకారం చేయడంతో పాటు, దేశం దృష్టిని ఆకర్షించే విధంగా మదనపల్లెను అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే సత్తా కూటమి ప్రభుత్వానికి ఉందన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలంతా కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. మదనపల్లె కేంద్రంగా హార్టికల్చర్ హబ్ ఏర్పాటు, బిజినెస్ స్కూల్ స్థాపన వంటి ప్రతిష్టాత్మక ఆలోచనలతో ఈ ప్రాంతాన్ని విద్య, వ్యాపార, ఉద్యానవన రంగాల్లో కీలక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉందన్నారు. మదనపల్లె అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ పనిచేసే మున్సిపల్ పాలకవర్గం ఉండటం ఎంతో అవసరమని తెలిపారు.

మున్సిపల్ చైర్మన్‌గా కూటమి అభ్యర్థి శ్రీరామ్ చినబాబు, 47 వార్డుల్లో పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులను ప్రజలు గెలిపిస్తే పట్టణ అభివృద్ధికి మరింత బలమైన పునాది పడుతుందన్నారు. చైర్మన్ నుంచి కౌన్సిలర్ల వరకు కూటమి పాలకవర్గం ఉంటే ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.

మదనపల్లె అభివృద్ధి అనేది ఒక్కరి ఆకాంక్ష కాదని, ప్రతి ఒక్కరి లక్ష్యమని రాటకొండ గురుప్రసాద్ పేర్కొన్నారు. పట్టణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓటర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు తమ విలువైన ఓటుతో మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. మదనపల్లె అభివృద్ధి.. మన అందరి ఆకాంక్ష.. మన అందరి అజెండా కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle