Madanapalle: ఎంపీ మిథున్ రెడ్డి రాకతో వర్షం - ప్రజలకు ఉపశమనం
Madanapalle: మదనపల్లెలో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన సందర్భంగా అకస్మాత్తుగా వర్షం కురవడంతో ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగిందని నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు.
Madanapalle: ఎంపీ మిథున్ రెడ్డి రాకతో వర్షం - ప్రజలకు ఉపశమనం
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి మదనపల్లెలో అడుగుపెట్టిన వెంటనే ప్రకృతి కరుణించి వర్షం కురవడంతో తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న మదనపల్లె ప్రజలకు ఉపశమనం లభించిందని మదనపల్లె నియోజకవర్గ వైసీపీ యువ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) అన్నారు.
ఈ సందర్భంగా హర్ష మాట్లాడుతూ.. గత కొంతకాలంగా ఎండలు, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మిథున్ రెడ్డి మదనపల్లెలోకి అడుగుపెట్టిన వెంటనే వర్షం కురవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రకృతి కూడా మిథున్ రెడ్డికి స్వాగతం పలికినట్లుగా వర్షం కురిసిందని హర్ష పేర్కొన్నారు.
వర్షంతో వాతావరణం చల్లబడటంతో ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగిందని తెలిపారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న మిథున్ రెడ్డికి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని హర్ష అన్నారు.




