Madanapalle: వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందడుగు!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం ఆర్. నడింపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ బలపరిచిన సిహెచ్. సరసమ్మ ఎన్నికల బరిలో నిలిచారు.

Srinivasulu, Madanapalle
Published on: 15 Nov 2026 2:32 PM IST
Madanapalle
X

Madanapalle: వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందడుగు!

మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం ఆర్. నడింపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సిహెచ్. సరసమ్మ ఎన్నికల బరిలో నిలిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తున్నారు. గ్రామంలో తమ కుటుంబానికి ఉన్న రాజకీయ అనుభవం, ప్రజలతో ఉన్న అనుబంధమే తనకు బలమని సరసమ్మ పేర్కొన్నారు. ఆమె బావ సిహెచ్. రామచంద్రారెడ్డి గతంలో రెండుసార్లు సర్పంచ్‌గా, ఒకసారి జడ్పీటీసీగా పనిచేశారు.

ఆయన హయాంలో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈసారి సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు కేటాయించడంతో గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు ఏకాభిప్రాయంతో సరసమ్మ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించి గ్రామ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle