Madanapalle: ఎంపీటీసీ ఎన్నికల్లో ఆదరించిన ప్రజలకు అభి వర్షిత్ కృతజ్ఞతలు!

Madanapalle: ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు అండగా నిలిచిన రామసముద్రం మండల ప్రజలకు వైఎస్సార్‌సీపీ నేత అభి వర్షిత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Srinivasulu, Madanapalle
Published on: 15 Nov 2026 3:00 PM IST
Madanapalle
X

Madanapalle: ఎంపీటీసీ ఎన్నికల్లో ఆదరించిన ప్రజలకు అభి వర్షిత్ కృతజ్ఞతలు!

మదనపల్లె: అన్నమయ్య జిల్లా వైఎస్సార్‌సీపీ స్టూడెంట్ వింగ్ జిల్లా కన్వీనర్, రాజంపేట పార్లమెంట్ జనరల్ సెక్రటరీ అభి వర్షిత్ రెడ్డి రామసముద్రం మండల ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు అండగా నిలిచి, వారి విజయానికి సహకరించిన ఓటర్లకు, నాయకులకు, కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా అభి వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలు చూపిన ఆదరాభిమానాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన కృషి మరువలేనిదన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తామని తెలిపారు.

రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే ఐక్యత, ఆదరణ, అభిమానాన్ని కొనసాగించాలని రామసముద్రం మండల ప్రజలను కోరారు. ఎంపీటీసీ ఎన్నికల్లో అందించిన సహకారాన్ని పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగిస్తూ వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్, వార్డు అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆశీస్సులు, అభిమానంతో రానున్న పంచాయతీ ఎన్నికల్లోనూ ముందుకు సాగుతామని అభి వర్షిత్ రెడ్డి పేర్కొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle