Madanapalle: 25వ వార్డు కౌన్సిలర్‌గా సమిమ్ అస్లాం ప్రమాణ స్వీకారం

Madanapalle: మదనపల్లె మున్సిపాలిటీ 25వ వార్డు కౌన్సిలర్‌గా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సమిమ్ అస్లాం ప్రమాణ స్వీకారం; వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని హామీ.

Srinivasulu, Madanapalle
Published on: 23 Nov 2026 6:06 PM IST
Madanapalle
X

Madanapalle: 25వ వార్డు కౌన్సిలర్‌గా సమిమ్ అస్లాం ప్రమాణ స్వీకారం

మదనపల్లె: మదనపల్లె మున్సిపాలిటీ 25వ వార్డు కౌన్సిలర్‌గా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, మాజీ ఏపీఎండీసీ డైరెక్టర్ సమిమ్ అస్లాం సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.

మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కౌన్సిలర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. 25వ వార్డు అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle