Madanapalle: శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దర్శనంతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన శ్రీరామ్!

Madanapalle: మదనపల్లె మున్సిపాలిటీ కూటమి చైర్మన్ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేస్తున్న శ్రీరామ్ చినబాబు శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దర్శనంతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

Srinivasulu, Madanapalle
Published on: 20 Oct 2026 9:58 AM IST
Madanapalle
X

Madanapalle: శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దర్శనంతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన శ్రీరామ్!

Madanapalle: మదనపల్లె మున్సిపాలిటీ కూటమి చైర్మన్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న శ్రీరామ్ కుమార్ (చినబాబు) ఎన్నికల ప్రచారానికి ముందు శ్రీ చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తొలి ప్రచార పత్రాన్ని అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మోడెమ్ సిద్ధప్ప, కె.వి. నాగరాజ, రామిశెట్టి రత్నమయ్య, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజాసేవలో ముందుకు సాగాలని శ్రీరామ్ చినబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle