Madanapalle: ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు

Madanapalle: మదనపల్లెలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమైందని సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తెలిపారు.

Srinivasulu, Madanapalle
Published on: 26 Jun 2026 3:09 PM IST
Madanapalle
X

Madanapalle: ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు

మదనపల్లె: మదనపల్లె ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ జూన్ 15 నుంచి ప్రారంభమైందని, ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వస్తున్న "ఓట్లు తొలగిస్తారు" అనే తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి సూచించారు.

ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ, ప్రతి ఇంటికీ బూత్ లెవల్ అధికారులు (BLOలు) స్వయంగా వెళ్లి అవసరమైన ఫారాలను అందజేస్తారని చెప్పారు.

ఫారాలను నింపడం రాని వారికి కూడా BLOలే పూర్తి సహాయం అందిస్తారని తెలిపారు. ప్రజలు తమ ఓటరు వివరాలను ECI యాప్ లేదా Voters.eci.gov.in ద్వారా కూడా సులభంగా నమోదు చేసుకోవచ్చని, సవరణలు చేసుకోవచ్చని ఆమె వివరించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా సమీపంలోని BLOలను లేదా సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story