Madanapalle: మదనపల్లెలో హోరెత్తిన టీడీపీ మహానాడు
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని జీనత్ ఫంక్షన్ హాల్లో టీడీపీ మహానాడు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Madanapalle: మదనపల్లెలో హోరెత్తిన టీడీపీ మహానాడు
Madanapalle: మదనపల్లె పట్టణంలోని జీనత్ ఫంక్షన్ హాల్లో క్లస్టర్ ఇంచార్జ్ రాగినేని రఘుపతి నాయుడు ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లె ఎమ్మెల్యే సాజన్ భాషా పాల్గొన్నారు. కార్యక్రమానికి యూనిట్ ఇంచార్జ్ కందికట్ల జయ చంద్ర కో-ఆర్డినేటర్‌గా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై మహానాడు తొలి రోజు కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో జెసిబి మధు, కొరకోటి సుబ్బయ్య, పసుపులేటి భాస్కర్, మహాదేవ యాదవ్, రమణారెడ్డి, ప్రవీణ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని, గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మహానాడు వేదికగా పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరగడం సంతోషకరమని తెలిపారు. పార్టీ విజయానికి కార్యకర్తల కృషే బలమని నాయకులు పేర్కొన్నారు.




