Madanapalle: చిప్పిలి శివాలయంలో ఆడి కృతిక ప్రత్యేక పూజలు

Madanapalle: మదనపల్లె సమీపంలోని చిప్పిలి శివాలయంలో ఘనంగా ఆడి కృతిక వేడుకలు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు.

Srinivasulu, Madanapalle
Published on: 7 Aug 2026 6:45 PM IST
Madanapalle
X

Madanapalle: చిప్పిలి శివాలయంలో ఆడి కృతిక ప్రత్యేక పూజలు

మదనపల్లె: ఆడి కృతిక పర్వదినాన్ని పురస్కరించుకుని మదనపల్లె సమీపంలోని చిప్పిలి గ్రామంలోని మడికయ్యల శివాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీరామ్ చినబాబు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందించారు.

అనంతరం ఆలయ చైర్మన్ కొప్పల వెంకటరమణ శ్రీరామ్ చినబాబును సత్కరించి, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొప్పల వెంకటరమణ, పాలకమండలి సభ్యులు వరప్రసాద్, కలిశం ప్రకాష్ నాయుడు, నరసింహమూర్తి, శివకుమార్, మల్లిక, సిద్ధయ్యతో పాటు స్థానిక నాయకులు, భక్తులు, తెలుగు యువత కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆడి కృతిక వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story