Madanapalle: మదనపల్లె: విజయ్ కుమార్ మనవరాలి ఓణి వేడుకకు చినబాబు హాజరు!

Madanapalle: మదనపల్లెలో బీపీఎల్ విజయ్ కుమార్ మనవరాలి ఓణి వేడుక ఘనంగా జరిగింది. తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, కూటమి నేతలు హాజరై ఆశీర్వదించారు.

Srinivasulu, Madanapalle
Published on: 26 July 2026 10:24 AM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె: విజయ్ కుమార్ మనవరాలి ఓణి వేడుకకు చినబాబు హాజరు!

మదనపల్లె: ప్రముఖ కాపు సంఘం నాయకులు బీపీఎల్ విజయ్ కుమార్ మనవరాలి ఓణి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ శుభకార్యానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ముఖ్య అతిథిగా హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఆప్యాయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన శ్రీరామ్ చినబాబు, చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, ఉన్నత భవిష్యత్తుతో ఎదిగి కుటుంబానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించి వారికి శుభాభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు సీడ్ మల్లికార్జున నాయుడు, రన్ టీవీ అధినేత సిరివేల చరణ్, కె. హనుమంతు, బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్, అలాగే కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు మరియు పలువురు ప్రముఖులు పాల్గొని చిన్నారికి ఆశీస్సులు అందజేసి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వేడుక ఆత్మీయ వాతావరణంలో ఘనంగా జరిగింది.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story