Madanapalle: ఎన్నికల్లో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు: తట్టి హరికృష్ణ!
Madanapalle: మదనపల్లె మండలం తట్టివారిపల్లి పంచాయతీ పరిధిలో ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికీ వైసీపీ యూత్ వింగ్ అధ్యక్షుడు తట్టి హరికృష్ణ రెడ్డి, అభ్యర్థి చలపతి కృతజ్ఞతలు తెలిపారు.
Madanapalle: ఎన్నికల్లో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు: తట్టి హరికృష్ణ!
మదనపల్లె: మదనపల్లె మండలం తట్టి వారి పల్లి పంచాయతీలో వైసీపీ మండల యూత్ వింగ్ అధ్యక్షుడు తట్టి హరికృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తమకు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఎంపీటీసీ అభ్యర్థి ఎన్. చలపతి తెలిపారు.
ఈ సందర్భంగా తట్టి హరికృష్ణ రెడ్డి మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో వైసీపీకి అండగా నిలిచి, తమకు సహాయ సహకారాలు అందించిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఎన్నికల ప్రక్రియలో తమకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరి సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.




