Madanapalle: మదనపల్లెలో ట్రాఫిక్ ఉల్లంఘనులపై పోలీసుల సీరియస్!

Madanapalle: మదనపల్లెలో ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు. హెల్మెట్ లేని ప్రయాణం, ట్రిపుల్ రైడింగ్‌పై సీఐ చాంద్ బాషా హెచ్చరిక ఉల్లంఘనదారులకు చలానాలు!

Srinivasulu, Madanapalle
Published on: 18 Sept 2026 2:08 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లెలో ట్రాఫిక్ ఉల్లంఘనులపై పోలీసుల సీరియస్!

Madanapalle: మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై మదనపల్లె ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, అతివేగంగా ప్రయాణించడం, ఒకే ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణించడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించారు.

నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు చలానాలు విధిస్తున్నారు. ఈ సందర్భంగా మదనపల్లె ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, అతివేగంగా వాహనాలు నడపవద్దని తెలిపారు. ఒకే వాహనంపై ముగ్గురు ప్రయాణించడం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని, అలాంటి వారిపై నిబంధనల ప్రకారం చలానాలు విధిస్తున్నామని చెప్పారు.

ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ట్రాఫిక్ నిబంధనల అమలుపై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని సీఐ తెలిపారు. వాహనదారులు పోలీసుల చర్యలకు సహకరించి, తమతో పాటు ఇతరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని కోరారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle