Madanapalle: రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన - హెల్మెట్ తప్పనిసరి
Madanapalle: మదనపల్లెలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు. హెల్మెట్ ధరించాలని, మైనర్లు డ్రైవింగ్ చేయరాదని ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా పిలుపు.
Madanapalle: రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన - హెల్మెట్ తప్పనిసరి
మదనపల్లె: రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు మదనపల్లె ట్రాఫిక్ పోలీసులు శనివారం అన్నమయ్య సర్కిల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది ద్విచక్ర వాహనదారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. వాహనం నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించరాదని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ వెంట ఉంచుకోవాలని సూచించారు.
వాహనాలకు తప్పనిసరిగా బీమా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను గౌరవించి సురక్షితంగా ప్రయాణించాలని సీఐ కోరారు. కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




