Madanapalle: శ్రీ పంజుర్లీ దేవి రూపంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు

Madanapalle: మదనపల్లెలో నవరాత్రి ఉత్సవాల్లో 5వ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీ పంజుర్లీ దేవి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.

Srinivasulu, Madanapalle
Published on: 15 Oct 2026 10:45 PM IST
Madanapalle
X

Madanapalle: శ్రీ పంజుర్లీ దేవి రూపంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు

Madanapalle: మదనపల్లె పట్టణంలో దసరా దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రతిరోజూ వివిధ అలంకరణల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో ఐదో రోజు అమ్మవారిని శ్రీ పంజుర్లీ దేవి అలంకారంలో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.

ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు మాట్లాడుతూ.. దేవీ నవరాత్రులను పురస్కరించుకుని ప్రతిరోజూ అమ్మవారిని ఒక్కో అలంకారంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బింగి పాండు గారు, ట్రెజరర్ నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ యల్లంపల్లి ప్రశాంత్, లక్కీ టైల్స్ నగేష్, ఆనంద్, సంఘ సభ్యులు పాణి, శివ, చైతన్య, వినోద్, నందన్, శ్రీరాములు, సంతోష్, నాగరాజు గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle