Madanapalle: మదనపల్లెలో స్వాతంత్య్ర వేడుకలు జెండా ఎగురవేసిన మధుసూదన్ రెడ్డి!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె వివేకానంద మున్సిపల్ హైస్కూల్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
Madanapalle: మదనపల్లెలో స్వాతంత్య్ర వేడుకలు జెండా ఎగురవేసిన మధుసూదన్ రెడ్డి!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని వివేకానంద మున్సిపల్ హైస్కూల్‌లో 32వ వార్డు సచివాలయం నీరుగట్టువారిపల్లి అధ్యక్షులు మండిపల్లి (జెసిబి) మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండాకు వందనం చేశారు.
ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే మన దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సచివాలయ సిబ్బంది, స్థానికులు పాల్గొని జాతీయ జెండాకు గౌరవం తెలిపారు. అనంతరం విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.




