Madanapalle: భారీ వర్షం ఎఫెక్ట్.. జేసీబీతో డ్రైనేజీ పూడికతీత పనులు!
Madanapalle: మదనపల్లె నిరుగట్టువారిపల్లిలోభారీ వర్షానికి తలెత్తిన డ్రైనేజీ సమస్యను జేసీబీతో పూడికతీత పనులు చేపట్టి పరిష్కరించిన 48వ వార్డు ఇంచార్జ్ రమేష్ రెడ్డి
Madanapalle: భారీ వర్షం ఎఫెక్ట్.. జేసీబీతో డ్రైనేజీ పూడికతీత పనులు!
Madanapalle: మదనపల్లె నిరుగట్టువారిపల్లి లో రాత్రి కురిసిన భారీ వర్షంతో 48వ వార్డులోని మురికి కాలువలు పొంగి డ్రైనేజీ నీరు రోడ్లపైకి, ఇళ్లలోకి చేరుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న 48వ వార్డు ఇంచార్జ్, స్నేహ మెడికల్స్ రమేష్ రెడ్డి వెంటనే స్పందించారు.
మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా ఆదేశాలతో సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, సచివాలయ సిబ్బందితో కలిసి ఉదయాన్నే జేసీబీ సహాయంతో మురికి కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించారు. అలాగే డ్రైనేజీ వాటర్ లైన్‌ను శుభ్రం చేయించి, నీరు సక్రమంగా వెళ్లేలా పనులను ప్రారంభించారు.
దీంతో డ్రైనేజీ సమస్యకు తక్షణ చర్యలు చేపట్టడంతో 48వ వార్డు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. సమస్యపై వెంటనే స్పందించిన వార్డు ఇంచార్జ్ రమేష్ రెడ్డి, సచివాలయ సిబ్బందికి, ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.




