Madanapalle: కానిస్టేబుల్ దాడి చేశాడని ఆరోపణ.. యువకుడి ఆత్మహత్యాయత్నం!
Madanapalle: మదనపల్లెలో ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై కానిస్టేబుల్ దాడి చేశాడన్న ఆరోపణలతో అతడు మిద్దెపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది.
Madanapalle: కానిస్టేబుల్ దాడి చేశాడని ఆరోపణ.. యువకుడి ఆత్మహత్యాయత్నం!
మదనపల్లె: మదనపల్లె పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వైఎస్సార్ కాలనీ, కోళ్లబైలు ప్రాంతానికి చెందిన రవి కుమారుడు నవదీప్.. నక్కలదిన్నె తాండాకు చెందిన మాధవిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం.
అనంతరం ఇద్దరూ మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా టూ టౌన్ ఎస్సై, సీఐ సానుకూలంగా స్పందించి, ఇద్దరూ మేజర్లు కావడంతో వారి ఇష్టప్రకారం కలిసి ఉండవచ్చని తెలిపినట్లు సమాచారం.
అయితే, ఆ సమయంలో కానిస్టేబుల్ రవి నాయక్ జోక్యం చేసుకుని నవదీప్పై దాడి చేశారని యువకుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో మనస్తాపానికి గురైన నవదీప్ మిద్దెపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. వెంటనే గమనించిన తల్లిదండ్రులు నవదీప్ను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
అనంతరం నవదీప్ తండ్రి రవి మీడియాతో మాట్లాడుతూ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ ఘటనపై సంబంధిత పోలీసు అధికారులు స్పందించి, ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాల్సి ఉంది.




