Madanapalle: ఓటు హక్కును వినియోగించుకున్న వైఎస్సార్సీపీ నాయకుడు హరికృష్ణ
Madanapalle: పుంగనూరు వాండ్లపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న తట్టి హరికృష్ణ రెడ్డి. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపు.
Madanapalle: ఓటు హక్కును వినియోగించుకున్న వైఎస్సార్సీపీ నాయకుడు హరికృష్ణ
మదనపల్లె: మదనపల్లె మండలం తట్టివారిపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం పుంగనూరు వాండ్లపల్లిలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మదనపల్లె యూత్ వింగ్ అధ్యక్షులు తట్టి హరికృష్ణ రెడ్డి, తట్టివారిపల్లి గ్రామ వైసీపీ నాయకులు, ఎంపీటీసీ అభ్యర్థి ఎన్. చలపతి, అన్నమయ్య జిల్లా సోషల్ మీడియా సెక్రటరీ ఆవుల సోమశేఖర్ రెడ్డి, తట్టి మోహన్ రెడ్డి, వినయ్, మహేష్ తదితరులు పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైనదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సూచించారు.




