Chittoor: జూన్ 1న జిల్లా కలెక్టరేట్ ముట్టడికి హర్షవర్ధన్ రెడ్డి పిలుపు!

Chittoor: ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూన్ 1న సోమవారం ఉదయం 10 గంటలకు "చలో జిల్లా కలెక్టరేట్" ముట్టడి కార్యక్రమం.

Srinivasulu, Madanapalle
Published on: 31 May 2026 10:41 AM IST
Chittoor
X

Chittoor: జూన్ 1న జిల్లా కలెక్టరేట్ ముట్టడికి హర్షవర్ధన్ రెడ్డి పిలుపు!

Chittoor: ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూన్ 1న సోమవారం చేపట్టనున్న "చలో జిల్లా కలెక్టరేట్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. మదనపల్లె జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో జాప్యం, పెన్షన్ల సమస్యలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఈ ఉద్యమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంఘీభావం తెలుపుతూ పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హర్షవర్ధన్ రెడ్డి కోరారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story