Madanapalle: ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం: జనసేన నేత జయ భవ్య!

Madanapalle: మదనపల్లె మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గ్లాస్, సైకిల్ గుర్తులకు ఓటేసిన ప్రతి ఒక్కరికీ జనసేన నాయకురాలు జయ భవ్య కృతజ్ఞతలు తెలిపారు.

Srinivasulu, Madanapalle
Updated on: 5 Nov 2026 11:05 PM IST
Madanapalle
X

Madanapalle: ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం: జనసేన నేత జయ భవ్య!

మదనపల్లె: మదనపల్లె మండలంలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు మద్దతుగా జడ్పీటీసీకి గ్లాస్ గుర్తుపై, ఎంపీటీసీకి సైకిల్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ జనసేన నాయకురాలు జయ భవ్య పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో జనసేన, కూటమి అభ్యర్థులపై నమ్మకంతో తమ విలువైన ఓటు వేసి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన్నారు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల విజయానికి కృషి చేసిన కూటమి నాయకులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, యువత, అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజలు తమపై చూపిన ఆదరాభిమానాలను ఎప్పటికీ మరచిపోమని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మండల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని జయ భవ్య పేర్కొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle