Kuppam: కుప్పం కోటలో వైసీపీ ఖాళీ.. ఎమ్మెల్సీ సమక్షంలో టీడీపీలోకి క్యూ!
Kuppam: కుప్పంలో వైసీపీకి షాక్. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేత టి.కె. ప్రభాకర్.
Kuppam: కుప్పం కోటలో వైసీపీ ఖాళీ.. ఎమ్మెల్సీ సమక్షంలో టీడీపీలోకి క్యూ!
చిత్తూరు జిల్లా: కుప్పం మున్సిపల్ పరిధిలోని 11 వ క్లస్టర్ పరిధిలోని 10, 11 వ వార్డులకు సంబంధించిన 11 వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి టికే ప్రభాకర్ మరియు పలువురు వైసిపి నాయకులు నేడు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా కుప్పం మున్సిపల్ పరిధిలోని డీకే పల్లిలోని ఆంగ్మిమారెమ్మ గుడి వద్ద ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పీకేఏం ఉడా చైర్మన్ డాక్టర్ సురేశ్ బాబులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై వారు పార్టీలోకి చేరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కడ అడ్వైజర్ మెంబర్ రాజ్ కుమార్, మున్సిపల్ అధ్యక్షుడు వెంకటేశ్, క్లస్టర్ ఇంచార్జ్ కన్నన్, యూనిట్ ఇంచార్జీ బాబు, మాజీ సర్పంచ్ మణి, పార్టీ సీనియర్ నాయకులు సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.




