Madanapalle: ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ సర్కిల్‌లో ఆదివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది.
Madanapalle: ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ
మదనపల్లె, జూన్ 28: మదనపల్లె చిత్తూరు బస్టాండ్ సర్కిల్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రామసముద్రం మండల మరాఠా అధ్యక్షుడు మంజునాథ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
శివాజీ మహారాజ్ దేశభక్తి, ధైర్యసాహసాలు, పరిపాలనా దక్షత నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. సమాజ ఐక్యతకు ఇలాంటి మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మరాఠా సంఘం నాయకులు, సభ్యులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Next Story




