Madanapalle: మాస్క్ ధరించి మహిళ మెడలోని గొలుసు లాగేందుకు యత్నం!
Madanapalle: నిమ్మనపల్లి మండలం రాచివేటివారిపల్లి శివారులో ఒంటరి మహిళ మెడలోని గొలుసు లాక్కెళ్లేందుకు యత్నించగా, ఆమె కొడవలితో దాడి చేసి దొంగను తరిమికొట్టింది.
Madanapalle: మాస్క్ ధరించి మహిళ మెడలోని గొలుసు లాగేందుకు యత్నం!
మదనపల్లె: మదనపల్లె నియోజకవర్గం నిమ్మలపల్లి మండలం రాచివేటివారిపల్లి గ్రామ శివారులో పొలం వద్ద పశువులకు మేత కోస్తున్న మహిళపై గుర్తుతెలియని వ్యక్తి దోపిడీకి యత్నించిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. మహిళ ఒంటరిగా పశువులకు మేత కోస్తుండగా మాస్క్ ధరించిన గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు.
అయితే మహిళ చేతిలో పశువుల మేత కోసే కొడవలి ఉండటంతో, గొలుసును లాక్కెళ్లే క్రమంలో ఆమె కొడవలితో ఆ వ్యక్తి చేతిపై కొట్టినట్లు సమాచారం. దీంతో గాయపడిన వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. మహిళ కేకలు వేయడంతో సమీపంలోని గ్రామస్తులు అక్కడికి చేరుకునేలోపే నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై గుర్తుతెలియని వ్యక్తి పరారైనట్లు స్థానికులు తెలిపారు.
Next Story




