Madanapalle: మదనపల్లెలో ఘనంగా హరికృష్ణరావు జన్మదిన వేడుకలు: పాల్గొన్న టీడీపీ శ్రేణులు
Madanapalle: మదనపల్లె టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగిన హరికృష్ణరావు (MHR) జన్మదిన వేడుకలు.
Madanapalle: మదనపల్లెలో ఘనంగా హరికృష్ణరావు జన్మదిన వేడుకలు: పాల్గొన్న టీడీపీ శ్రేణులు
Madanapalle: మదనపల్లె పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం హరికృష్ణరావు (MHR) జన్మదిన వేడుకలు టీడీపీ సీనియర్ రాష్ట్ర నాయకులు కట్టా దొరస్వామి నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి హరికృష్ణరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కట్టా దొరస్వామి నాయుడు మాట్లాడుతూ, “హరికృష్ణరావు పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజలతో మమేకమై పనిచేస్తున్న నాయకుడు. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని కోరుకుంటున్నాం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ స్వామి రెడ్డి, గౌతమ్,రామాపురం శీనా, ఈవూరి చంద్రబాబు, కట్టా లక్ష్మినారాయణ, నవీన్, హేమంత్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని హరికృష్ణరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.




