Sambepalli: రిటైర్డ్ ఎస్ఈ వీరనాగన్న మృతి పట్ల మంత్రి మండిపల్లి సంతాపం!
Sambepalli: సంబేపల్లి మండలం కొండావండ్లపల్లెకు చెందిన రిటైర్డ్ ఎస్ఈ వీరనాగన్న మృతి పట్ల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నివాళులర్పించి సంతాపం తెలిపారు.
Sambepalli: రిటైర్డ్ ఎస్ఈ వీరనాగన్న మృతి పట్ల మంత్రి మండిపల్లి సంతాపం!
సంబేపల్లి: సంబేపల్లి మండలం కొండావండ్లపల్లె గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎస్.ఈ. వీరనాగన్న గారు మృతి చెందడం పట్ల మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వీరనాగన్న గారి భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
వీరనాగన్న గారి మృతి వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తీరని లోటని పేర్కొంటూ, ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి మనోధైర్యం కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.




