Chittoor: వసంత కుమార్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది: నారా లోకేష్!
Chittoor: ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన మాజీ కార్పొరేటర్ వసంత కుమార్ కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Chittoor: వసంత కుమార్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది: నారా లోకేష్!
చిత్తూరు: ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన చిత్తూరుకు చెందిన మాజీ కార్పొరేటర్ వసంత కుమార్ కుటుంబాన్ని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. పార్టీ కోసం పనిచేసిన వసంత కుమార్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
వసంత కుమార్ శుభస్వీకరణ కార్యక్రమం సందర్భంగా ఆదివారం రాత్రి ఆయన నివాసానికి నారా లోకేష్ వెళ్లారు.ఈ సందర్భంగా వసంత కుమార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.అనంతరం వసంత కుమార్ భార్య శిల్ప, కుమార్తె మోక్షశ్రీ, కుమారుడు డమరకేష్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు.
వసంత కుమార్ పార్టీ కోసం చేసిన సేవలను పార్టీ ఎప్పటికీ మరువదని నారా లోకేష్ పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలిచేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
నారా లోకేష్ వెంట చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే తామస్, నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్, పుతాలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ , ఎమ్మెల్సీ శ్రీకాంత్,తూడా చైర్మన్ డాలర్ దివాకర్ , టీడీపీ జిల్లా అధ్యక్షుడు షణ్ముఖ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు,సీనియర్ నాయకులు సీకే లావణ్య, చంద్రప్రకాష్, కాజూర్ బాలాజీ, మాజీ ఎమ్మెల్యేలు మనోహర్, గాంధీ తదితరులు ఉన్నారు.




