Puthalapattu: చెల్లెమ్మ అంటూనే ఆరో తరగతి బాలికను ఎత్తుకెళ్లిన యువకుడు!
Puthalapattu: నోచ్చుపల్లిలో నమ్మకంగా ఉంటూ బాతులు మేపే దంపతుల కుమార్తె దీప్తిని కిడ్నాప్ చేసిన భాను. కన్నకూతురి కోసం తల్లిదండ్రుల కన్నీరు, పోలీసుల గాలింపు.
Puthalapattu: చెల్లెమ్మ అంటూనే ఆరో తరగతి బాలికను ఎత్తుకెళ్లిన యువకుడు!
పూతలపట్టు: యువతీ అదృశ్యం.... కన్న కూతురు అదృశ్యమవడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. పూతలపట్టు మండలం వావిల్ తోట పంచాయతీ నొ చ్చుపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న రాజు. రవళి దంపతుల కుమార్తె దీప్తి. వావిల్ తోట ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుకుంటుంది. దీప్తి తల్లిదండ్రులు బాతులు మే పుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఇదిలా ఉండగా మూడు సంవత్సరాల క్రితం తిరుపతి జిల్లా చిత్తలూరు సమీపానగల ఎన్టీఆర్ కాలనీ కి చెందిన భాను అనే యువకుడు నోచ్చుపల్లి గ్రామానికి వచ్చి తనకు తల్లిదండ్రులు లేరని మూడు పూటలు అన్నం పెడితే చాలని మీతోనే ఉండిపోఇ బాతులు మేపుతానని దీప్తి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అతని మాటలు నమ్మి మూడు సంవత్సరాలుగా అతనిని బాగా చూసుకుంటూ ఉండగా అతను దీప్తిని చెల్లెమ్మ చెల్లెమ్మ అంటూ పిలవడంతో వారు భాను మాయమాటలను నమ్మారు.
ఈ నేపథ్యంలో గత నెల 17వ తేదీన దీప్తి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో భాను దీప్తిని తీసుకొని వెళ్లిపోయాడు. దీంతో దీప్తి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. తన కూతుర్ని అతడు ఏం చేశాడు అని ఆ తల్లిదండ్రులు శనివారం విలేకరుల ముందు బోరున వినిపించారు.




