Ramasamudram: అన్నమయ్య జిల్లాలో ఓటరు సవరణ ముగింపు వేడుకలు!

Ramasamudram: రుమలరెడ్డిపల్లిలో జరిగిన ఎస్‌ఐఆర్ (SIR) ఓటరు సవరణ కార్యక్రమంలో మైనార్టీ అధ్యక్షుడు సర్దార్ బాషా పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Srinivasulu, Madanapalle
Published on: 14 July 2026 10:26 PM IST
Ramasamudram
X

Ramasamudram: అన్నమయ్య జిల్లాలో ఓటరు సవరణ ముగింపు వేడుకలు!

రామసముద్రం: అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం తిరుమలరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ (SIR) కార్యక్రమంలో మైనార్టీ అధ్యక్షుడు సర్దార్ బాషా, స్థానిక నాయకుడు వల్లి చంద్రారెడ్డి ఆధ్వర్యంలో పాల్గొన్నారు.

ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఎస్‌ఐఆర్ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించి, అవసరమైన వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మైనార్టీ అధ్యక్షుడు సర్దార్ బాషా మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఓటరు ఎస్‌ఐఆర్ ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొని తమ వివరాలను సక్రమంగా నమోదు చేయించుకోవాలని కోరారు.

ఓటరు జాబితా పారదర్శకంగా, ఖచ్చితంగా ఉండేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలకు తావు ఇవ్వకుండా సంబంధిత అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియకు చివరి రోజు కావడంతో ఇంకా నమోదు చేయించుకోని అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story