Chittoor: ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే
Chittoor: చిత్తూరు ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ నెల 24న అనుప్పల్లి వద్ద నిరుపేదలకు 2 సెంట్ల చొప్పున ఇంటి స్థలాలు పంపిణీ.
Chittoor: ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే
Chittoor: ప్రజల నుంచి అందే వినతులు,ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో అక్కడికక్కడే ఫోన్‌లో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న వినతులను వేగంగా పరిష్కరిస్తున్నామని చెప్పారు.ప్రజాదర్బార్‌లో మొత్తం 43 వినతులు అందినట్లు పేర్కొన్నారు.
అలాగే ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే తెలిపారు.చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని అనుప్పల్లి వద్ద ఈ నెల 24న ఇంటి స్థలాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.గతంలో ఇస్తున్న ఒక సెంటు స్థలానికి బదులుగా రెండు సెంట్ల స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.అనుప్పల్లి లేఅవుట్‌లో వీధి దీపాల ఏర్పాటుకు కలెక్టర్ రూ.5 లక్షలు మంజూరు చేశారని తెలిపారు.




