Palamaner: ప్రమాదంలో గాయపడిన టీడీపీ నేతలను పరామర్శించిన ఎమ్మెల్యే అమరనాథ్
Palamaner: ఎన్. అమరనాథ్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీడీపీ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు నాగరాజు, పార్టీ నాయకుడు డిష్ శేఖర్‌లను పరామర్శించారు
Palamaner: ప్రమాదంలో గాయపడిన టీడీపీ నేతలను పరామర్శించిన ఎమ్మెల్యే అమరనాథ్
పలమనేరు:రోడ్డు ప్రమాదంలో గాయపడిన తెలుగుదేశం పార్టీ నాయకులను పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
వారం రోజుల క్రితం గంగవరం మండలం సాయినగర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీడీపీ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు నాగరాజు, పార్టీ నాయకుడు డిష్ శేఖర్‌ను స్థానిక నాయకులతో కలిసి వారి వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే ప్రతి కార్యకర్త సంక్షేమం తమకు అత్యంత ముఖ్యమని అన్నారు.
ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని, వైద్య సహాయానికి చేసిన ఖర్చు సీఎంఆర్ఎఫ్ ద్వారా కొంత మేరకు అందేలా చూస్తామన్నారు.
ఇద్దరూ త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకుని మళ్లీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆయన ఆకాంక్షించారు. ఎలాంటి అవసరం వచ్చినా పార్టీ, తాను ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఎమ్మెల్యే పరామర్శతో నాగరాజు, డిష్ శేఖర్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్సీ కుమార్, భాస్కర్ యాదవ్, చిన్నీ, మురళీ, లోకేష్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.




