Tirupati: 100 మీటర్ల భారీ జాతీయ జెండాతో ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ!

Tirupati: తిరుపతి జిల్లా నాయుడుపేటలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో 100 మీటర్ల జాతీయ జెండాతో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ, బైక్ ర్యాలీ నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Aug 2026 11:37 AM IST
Tirupati
X

Tirupati: 100 మీటర్ల భారీ జాతీయ జెండాతో ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ!

Tirupati: తిరుపతి జిల్లా నాయుడుపేట లో హర్ గర్ తిరంగా ర్యాలీలో లో పాల్గొన్న సూళ్లూరుపేట శాసన సభ్యురాలు నెలవల విజయశ్రీ, ఇంచార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సామాన్య ప్రజలు ముఖ్యంగా ఆయా పాఠశాలల, కాలేజీల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నాయుడుపేటలోని గాంధీ మందిరం వద్ద నుండి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో 100 మీటర్ల జెండాను ర్యాలీగా బయలుదేరిన ఎమ్మెల్యే విజయశ్రీ అనంతరం బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. బైక్ పైనే ఆమె డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతోమంది కష్టఫలమే స్వాతంత్రం అని అలాంటి స్వాతంత్రం భారతదేశంలో సాధించి 80 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సంతోషమైన విషయమని ఈ 80 ఏళ్లలో భారతదేశం అనేక రంగాలలో ముందుకు వెళ్లిందని నేడు ప్రపంచ దేశాలలో అగ్రదేశాలతో పోటీగా భారతదేశం ఉండడం ప్రపంచ దేశాలకు భారతదేశ మార్గదర్శకంగా ఉండడం భారత దేశ ప్రజలకు గర్వకారణమని ఆమె తెలియజేయడం జరిగింది.

స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా భారతదేశంలో ప్రతి ఒక్కరూ దేశ అభ్యున్నతికి తోడ్పడే విధంగా ఉండాలని ముఖ్యంగా యువత దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెరగాలని దేశ భవిష్యత్తుకు అభ్యున్నతిని తీసుకువచ్చే విధంగా యువత ముందుకు నడవాలని ఎమ్మెల్యే విజయశ్రీ అన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story