Srikalahasti: శ్రీకాళహస్తిలో దళితులకు భరోసా.. జగన్ పాలనపై ఎమ్మెల్యే ఫైర్!
Srikalahasti: శ్రీకాళహస్తిలోని ఊరందరు హరిజనవాడలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ‘దళితులకు భరోసా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Srikalahasti: శ్రీకాళహస్తిలో దళితులకు భరోసా.. జగన్ పాలనపై ఎమ్మెల్యే ఫైర్!
Srikalahasti: శ్రీకాళహస్తిలోని ఊరందరు హరిజనవాడ నందు దళితులకు భరోసా కార్యక్రమాన్ని ఎమ్మెల్యేబొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు..వైసిపి ఐదేళ్ల పాలన దళితుల చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయమంటు గత ప్రభుత్వంలో దళితులపై జరిగిన చిత్రాలను ఫ్లెక్సీ ల రూపంలో దళితులతో చేయి చేయి పట్టుకుని చూపించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జలసుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి దళితులంటే ద్వేషమని వారిపై కక్ష తీర్చుకునే విధంగా.. అనేక దారుణాలు చేశారని,గత ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవినీతి, అరాచక పాలనలో రాష్ట్రంలోని దళిత సమాజం తీవ్ర అవమానాలు, అణచివేత, దౌర్జన్యాలు ఎదుర్కొంటూ నరకయాతన అనుభవించిందని జగన్ మోహన్ రెడ్డి దళిత వ్యతిరేక విధానాలకు డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యంల ఉదంతాలే సజీవ సాక్ష్యాలని పేర్కొన్నారు:
ఆసుపత్రిలో సుదీర్ఘంగా 20 ఏళ్లకు పైగా విశేష సేవలందించి, ప్రజల్లో ఎంతో మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకున్న దళిత డాక్టర్ సుధాకర్‌ను కరోనా విపత్తు సమయంలో కనీస ప్రాణరక్షణ కోసం మాస్కులు, పీపీఈ కిట్లు అడిగినందుకు అప్పటి ప్రభుత్వం అమానుషంగా వేధించింది. ఆయనపై రాజకీయ ముద్ర వేసి సస్పెండ్ చేయడమే కాకుండా, నడిరోడ్డుపై అర్ధనగ్నంగా మార్చి, చేతులు వెనక్కి విరిచి కట్టి బంధించి లాఠీలతో కొట్టారు. తీవ్ర మానసిక శోభకు గురిచేసి, చివరకు 2021 మే 21న ఆయన మరణించేలా చేశారని. ఆయన కన్నుమూసి ఐదేళ్లు అవుతున్నా ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం కూటమి ప్రభుత్వం విస్మరించలేనిది,కాకినాడకు చెందిన 26 ఏళ్ల దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం, వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. 2022 మే 19 రాత్రి కాగా, కొందరు వ్యక్తులు అతన్ని ఇంటి నుంచి తీసుకెళ్లారు. అర్ధరాత్రి దాటాక అప్పటి ఎమ్మెల్సీ నాయకుడు స్వయంగా సుబ్రహ్మణ్యం శవాన్ని తన కారులో వేసుకొచ్చి, యాక్సిడెంట్ అని నమ్మబలుకుతూ కుటుంబ సభ్యులకు 'డోర్ డెలివరీ' ఘటన మరిచిపోలేనీదని. పోస్టుమార్టం నివేదికలో సుబ్రహ్మణ్యం ఒంటిపై 31 చోట్ల బలమైన కత్తిగాట్లు, గాయాలు ఉన్నట్లు తేలింది. ఇంతటి ఘోరం జరిగినా అప్పటి సీఎం జగన్ కనీసం స్పందించలేదు సరేకదా, నిందితుడికి కొద్దిరోజులకే బెయిల్ వచ్చేలా చేసి స్వేచ్ఛగా తిరిగేలా ప్రోత్సహించిన ఘనత వైసిపి నాయకులకే దక్కిందన్నారు.
గత ఐదేళ్లలో దళిత సమాజంపై జరిగిన వ్యవస్థీకృత దాడుల ఖచ్చితమైన కేంద్ర ప్రభుత్వ మరియు ఎన్‌సిఆర్‌బి (NCRB) లెక్కలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వివరించారు. మారణహోమం & దాడులు: జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 220 మంది దళితులు దారుణంగా హత్యకు గురయ్యారు. దళితులపై జరిగిన అధికారిక దాడుల సంఖ్య 56,981 కి చేరిందని.
రాష్ట్రంలో దళిత మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా 637 అత్యాచార సంఘటనలు జరిగాయని. గత వైకాపా ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే దళిత మహిళలపై దాడుల్లో ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉందని ఎన్‌సిఆర్‌బి నివేదికలు స్పష్టం చేస్తున్నాయని. నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన అనుష, పులివెందులలో నాగమ్మ, అనంతపురంలో జూనియర్ నేషనల్ ప్లేయర్ స్నేహలత, గుంటూరులో రమ్య వంటి ఎందరో దళిత ఆడబిడ్డలను అత్యంత క్రూరంగా రేప్ చేసి హత్య చేశారని.
పులివెందులలో బాధితులను పరామర్శించడానికి వెళ్లిన వారిపైనే రివర్స్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం జగన్ అహంకారానికి పరాకాష్ట. తీవ్రస్థాయికి చేరిందని,ళితుల జీవనాధారమైన 11,000 ఎకరాల అసైన్డ్ భూములను జగన్ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్, రీ-సర్వేల పేరుతో బలవంతంగా లాక్కుని దళితులను రోడ్డున పడేసిందనీ. మదనపల్లిలో వైన్ షాప్ దగ్గర మద్యం నాణ్యత లేదని ప్రశ్నించి, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినందుకు వైసిపి ఓ లీగల్ సెల్ కార్యకర్త మరుసటి రోజే అనుమానాస్పద స్థితిలో చంపేశారని. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు వరప్రసాద్ అనే దళిత యువకుడికి గుండు కొట్టించి అవమానిచిన ఘటన వైకాపా ప్రభుత్వంలోని జరిగిందని..
కడప వెటర్నరీ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ అచ్చన్నను కులం పేరుతో మానసిక వేధింపులకు గురిచేసి అంతమొందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం 'కోడి-కత్తి' కేసు పేరుతో దళిత యువకుడు జనిపల్లి శ్రీనును ఐదేళ్లపాటు బెయిల్ రాకుండా జైల్లో మగ్గేలా చేశారని. కోనసీమ జిల్లాకు డా. బి.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టి, దానిని వివాదంగా మలిచి కులాల మధ్య కుంపట్లు రాజేసి తన స్వలాభాల కోసం జగన్మోహన్ రెడ్డి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూశారని, ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమై ప్రజలు చెంపదెబ్బ కొట్టినా వైసిపి నాయకుల తీరు మారలేదని.
ఇటీవల అన్నమయ్య జిల్లాలో ఓ వైసిపి లీగల్ సెల్ అధ్యక్షుడు తన 20 మంది అనుచరులతో కలిసి మండల పరిషత్ ఆఫీసు (MPDO) లో చొరబడి, దళిత అధికారి అయిన యంపిడిఓ జవహర్ బాబుపై ఇష్టారాజ్యంగా దాడి చేశారని గుర్తుచేశారు. ఎంపీపీ వచ్చాక తాళం తీస్తామని చెప్పినందుకు "మాకు ఎదురు చెప్తావా" అంటూ కిందపడేసి తన్నారని. అడ్డు వచ్చిన అటెండర్, డ్రైవర్‌ను కూడా చితకబాది తాళాలు పగలగొట్టడం వారి శాడిజానికి నిదర్శనమన్నారు. ఎన్నికలొస్తే "నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు" అంటూ ఓట్ల కోసం నాటకాలడే జగన్ మోహన్ రెడ్డి, అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ. 27,000 కోట్లు,
ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ. 5,000 కోట్లు మొత్తం రూ. 33,000 కోట్ల రాజ్యాంగబద్ధమైన సంక్షేమ నిధులను దారిమళ్లించి, దళితులకు అందాల్సిన సబ్సిడీలు, లోన్లు, గ్రాంట్లు రాకుండా కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారన్నారు, తమ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనేముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుసమర్థవంతమైన నాయకత్వంలో, ఎన్డీయే కూటమి ప్రభుత్వం దళితుల ఆత్మగౌరవం, రక్షణ, హక్కులను కాపాడటమే పరమావధిగా పనిచేస్తోందని ఇందులో భాగంగానే: ప్రస్తుత 2026-27 బడ్జెట్‌లో ఎస్సీ సంక్షేమానికి ఏకంగా రూ. 22,000 కోట్లు కేటాయించామని.గత వైసిపి ప్రభుత్వం దుర్మార్గంగా రద్దు చేసిన 18 దళిత సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించిందని. ఇలా అనేక సంక్షేమ పథకాలను దళితులకు అండగా వారి అభివృద్ధికి దోహదపడేలా తీసుకొని వచ్చిందని తెలియజేశారు.
దళిత యువతను కేవలం కార్మికులుగా కాకుండా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక సబ్సిడీలు,ప్రోత్సాహకాలను తమ ప్రభుత్వం అందిస్తున్నామని. గత ఐదేళ్ల జగన్ అరాచక పాలనపై దళిత వాడల్లో, గ్రామాల్లో విస్తృతంగా చర్చ జరగాలని, బాధితులందరికీ కూటమి ప్రభుత్వం అండగా నిలబడి న్యాయం చేకూరుస్తుందని ఎమ్మెల్యే గణభరోసాను ఇచ్చారు.




