Mogili: ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తాం..విజయ్ కుమార్

Mogili: మొగిలిశ్వరాలయం అభివృద్ధికి వంశపారపర్య ధర్మకర్త విజయ్ కుమార్ సహకారం అందిస్తామని తెలిపారు. కొత్త పాలకమండలికి అభినందనలు తెలిపారు.

VASU, PUTTALAPATTU
Published on: 1 Oct 2026 11:38 PM IST
Mogili
X

Mogili: ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తాం..విజయ్ కుమార్

మొగిలి: మొగిలి శ్వర దేవాలయానికి పురాతన కాలం నుండి తమ వంశస్తుల నుండి స్వామివారికి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి తమ వంతు సహాయ సహకారాలు ఆలయ అభివృద్ధికి అందించామని విజయ్ కుమార్ తెలిపారు.

మొగిలి శ్వర దేవాలయానికి కొత్తగా పాలకమండలి నియమించిన దానికి రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. కొత్తగా పాలకమండలి కమిటీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన కమల్ నాథ్ రెడ్డి నేతృతంలో పాలకమండలి సభ్యులందరూ ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ కాణిపాక ఆలయ చైర్మన్ మణి నాయుడు , పాలకవర్గ సభ్యులు, కూటమి అధికార పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU