Madanapalle: గ్యాస్ లీక్ విషాదం.. తల్లి, కూతురికి తీవ్ర గాయాలు!

Madanapalle: మదనపల్లె మండలం కొత్తపల్లి పంచాయతీ కొత్త ఇండ్లలో గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో తల్లి, కూతురు తీవ్రంగా గాయపడ్డారు.

Srinivasulu, Madanapalle
Published on: 3 Aug 2026 9:37 AM IST
Madanapalle
X

Madanapalle: గ్యాస్ లీక్ విషాదం.. తల్లి, కూతురికి తీవ్ర గాయాలు!

Madanapalle: మదనపల్లె మండలంలో గ్యాస్ లీక్ కారణంగా మంటలు చెలరేగి తల్లి, కూతురు తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని కొత్త ఇండ్లలో నివాసం ఉంటున్న లేట్ నాగ భార్య, ప్రత్యేక ప్రతిభావంతురాలు జ్యోతి (26) తన కుమార్తె లహరి (8)ను పాఠశాలకు పంపేందుకు సిద్ధం చేస్తోంది.

ఈ క్రమంలో కుమార్తెకు స్నానం చేయించేందుకు బాత్రూంకు తీసుకెళ్లి, గీజర్‌కు అమర్చిన గ్యాస్ సిలిండర్‌ను ఆన్ చేయగానే ఒక్కసారిగా గ్యాస్ లీక్ కారణంగా మంటలు చెలరేగాయి. అనూహ్యంగా మంటలు వ్యాపించడంతో తల్లి, కూతురు ఇద్దరూ మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. వారి కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చి, బాధితులను రక్షించారు. అనంతరం గాయపడిన జ్యోతి, లహరిని స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story