Punganur: పుంగనూరులో పర్యటించిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి!
Punganur: అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటించి అంజుమాన్ కమిటీ భవనాన్ని ప్రారంభించి, కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు.
Punganur: పుంగనూరులో పర్యటించిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి!
Punganur: పుంగనూరులో పర్యటించిన రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి , అంజుమాన్ కమిటీ భవనాన్ని ప్రారంభించిన మిథున్ రెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో పుంగనూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం.భారీగా పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.
నియోజకవర్గం లో వివిధ పార్టీ పదవులు పొందిన వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐడి కార్డులు పంపిణీ , ఎంపీ శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కామెంట్స్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పుంగనూరు నియోజకవర్గం లో రోడ్లు వేశాం.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి చెందింది, ఇన్ని రోజులు ఏ ఒక్క ప్రభుత్వం మన గురించి ఆలోచించలేదు , పుంగనూరు కు నీరు లేక అనేక ఇబ్బందులు పడుతుంటే వైఎస్ జగన్ ప్రాజెక్టులు సిద్ధం చేశారు.
టీడీపీ నాయకులకు పుంగనూరు పై సవతి తల్లి ప్రేమ మాత్రమే , ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇచ్చిన పాపాన పోలేదు , అనేక పథకాలు అమలు చేస్తాం అని కూటమి ప్రభుత్వ పెద్దలు మోసం చేశారు. అనేక గ్రామాల్లో మేము వాటర్ ప్లాంట్ పెట్టాం. కనీసం వాటర్ ప్లాంట్ పట్టే పరిస్థితులో టీడీపీ ప్రభుత్వం లేదు.
రెచ్చగొట్టి మా పై రాళ్ళు వేయించారు... పుంగనూరు ప్రశాంతంగా ఉండాలి, మనకి గొడవలు వద్దు అని శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అన్నారు. రాళ్ళు వేసిన వారు కూడా అమాయకులే, ఎవరో మాటలు విని అలా చేశారు అని మేము ఇంట్లో మాట్లాడుకున్నాం.
అనేక కేసులు పెట్టీ నన్ను కూడా జైలు లో పెట్టారు. కానీ ఏ రోజు మేము ఎవరిని రెచ్చగొట్టలేదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టినా పర్లేదు... ఇది మా మంచితనం కానీ క్యాడర్ జోలికి వస్తే మాత్రం ఎలక్షన్ కౌంటింగ్ పూర్తి అయ్యేలోపు సినిమా చూపిస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం అంతా పోరాటం చేయాలి.. వైసీపీని భారీ స్థాయిలో గెలిపించాలి.




