Madanapalle: ప్రజల మనిషి ఎంపీ మిథున్ రెడ్డి బండపల్లి వెంకటరమణ!

Madanapalle: మదనపల్లె మండలం అడ్డగింటివారిపల్లెలో ఎంపీ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను వైసీపీ నాయకుడు బండపల్లి వెంకటరమణ ప్రారంభించారు.

Srinivasulu, Madanapalle
Published on: 8 Aug 2026 1:37 PM IST
Madanapalle
X

Madanapalle: ప్రజల మనిషి ఎంపీ మిథున్ రెడ్డి బండపల్లి వెంకటరమణ!

Madanapalle: అనునిత్యం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రజల మనిషిగా ఖ్యాతి పొందారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు బండపల్లి వెంకటరమణ అన్నారు. మదనపల్లె మండలం సీటీఎం క్రాస్‌ రోడ్డు పంచాయతీ పరిధిలోని అడ్డగింటివారిపల్లెలో ఎంపీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం బండపల్లి వెంకటరమణ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, పార్టీ కార్యకర్తలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచి ఆదుకునే నాయకుడు మిథున్ రెడ్డి అని కొనియాడారు. ఎంపీగా హ్యాట్రిక్ విజయం సాధించిన మిథున్ రెడ్డి స్ఫూర్తితో భవిష్యత్ తరాల రాజకీయ నాయకులు ప్రజాసేవకు అంకితమై పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సుధాకర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈశ్వర్ రెడ్డి, భువనేశ్వర్ రెడ్డి, రెడ్డి శేఖర్ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story