Ramasamudram: మలేనత్తంలో ఎంపీపీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఓటరు జాబితా సవరణ

Ramasamudram: అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం మలేనత్తంలో ఎంపీపీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి ఓటరు జాబితా సవరణ (SIR)పై అవగాహన కల్పించారు.

Srinivasulu, Madanapalle
Published on: 3 July 2026 1:14 PM IST
Ramasamudram
X

Ramasamudram: మలేనత్తంలో ఎంపీపీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఓటరు జాబితా సవరణ

Ramasamudram: అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం మలేనత్తం పంచాయతీలో వైసీపీ నాయకుడు, ఎంపీపీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఎస్.ఐ.ఆర్ (ఓటరు జాబితా ప్రత్యేక సవరణ) కార్యక్రమం నిర్వహించారు.

మ ఓటరు వివరాలను పరిశీలించుకోవాలని, కొత్తగా అర్హత పొందిన వారు పేర్లు నమోదు చేసుకోవాలని, అలాగే తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎంపీపీ రమణారెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.

ఓటరు జాబితాలో పేర్లు, చిరునామాలు, ఇతర వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సవరించుకోవాలని, కొత్తగా అర్హత పొందిన యువత తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రజలకు ఎస్.ఐ.ఆర్ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story