Thamballapalle: ములకలచెరువు ఎంపీపీగా కట్టా దొరస్వామి నాయుడు ఏకగ్రీవ ఎన్నిక
Thamballapalle: తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువు ఎంపీపీగా కట్టా దొరస్వామి నాయుడు, వైస్ ఎంపీపీగా మౌలా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు.
Thamballapalle: ములకలచెరువు ఎంపీపీగా కట్టా దొరస్వామి నాయుడు ఏకగ్రీవ ఎన్నిక
తంబళ్లపల్లి: తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువు మండల పరిషత్ అధ్యక్షుడిగా కట్టా దొరస్వామి నాయుడు, వైస్ ఎంపీపీగా మౌలాను మండల పరిషత్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎంపీపీ, వైస్ ఎంపీపీగా వారు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా నూతన ఎంపీపీ కట్టా దొరస్వామి నాయుడు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఎంపీపీగా ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి పార్టీలకతీతంగా కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో ముందుకు సాగుతానని పేర్కొన్నారు.




