Thamballapalle: ఏకగ్రీవ ఎంపీటీసీకి కట్టా దొరస్వామి నాయుడు శుభాకాంక్షలు!

Thamballapalle: ములకలచెరువు ఎంపీటీసీ ఏకగ్రీవ ఎన్నికపై కట్టా దొరస్వామి నాయుడు హర్షం. నాయకత్వంపై ప్రజల నమ్మకానికి ఈ విజయం నిదర్శనమని అభినందనలు.

Srinivasulu, Madanapalle
Published on: 27 Oct 2026 11:04 PM IST
Thamballapalle
X

Thamballapalle: ఏకగ్రీవ ఎంపీటీసీకి కట్టా దొరస్వామి నాయుడు శుభాకాంక్షలు!

తంబళ్లపల్లి: తంబళ్లపల్లి జి. శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ములకలచెరువు ఎంపీటీసీ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా కట్టా దొరస్వామి నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ప్రజల్లో ఉన్న నమ్మకానికి, నాయకత్వంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.

ప్రజల ఆదరాభిమానాలతో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి, ప్రజాసేవలో మరింత గుర్తింపు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు కట్టా దొరస్వామి నాయుడు తెలిపారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle