Madanapalle: HMTV కథనానికి అదిరిపోయే ఎఫెక్ట్.. రంగంలోకి దిగిన అధికారులు

Madanapalle: మదనపల్లె నక్కలదిన్నె డేగల రామయ్య వీధిలోని డ్రైనేజీ సమస్యలపై HMTV కథనానికి స్పందించిన మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్య పనులను ప్రారంభించారు.

Srinivasulu, Madanapalle
Published on: 28 July 2026 11:32 PM IST
Madanapalle
X

Madanapalle: HMTV కథనానికి అదిరిపోయే ఎఫెక్ట్.. రంగంలోకి దిగిన అధికారులు

మదనపల్లె: మదనపల్లె పట్టణంలోని నక్కలదిన్నె డేగల రామయ్య వీధిలో గత ఏడు నెలలుగా కాలువలు, చెత్త తొలగింపు పనులు జరగక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని HMTVలో ప్రసారమైన వార్తకు మున్సిపల్ అధికారులు స్పందించారు. వార్త ప్రసారమైన వెంటనే సంబంధిత అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

అనంతరం ప్రత్యేక సిబ్బందితో కాలువలలో పేరుకుపోయిన మురుగునీరు, చెత్తను తొలగించే పనులను ప్రారంభించారు. దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగేలా పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులు స్పందిస్తూ, తమ సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన HMTVకు కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే వెంటనే స్పందించి కాలువల శుభ్రత పనులు చేపట్టిన మున్సిపల్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇకపై ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా క్రమం తప్పకుండా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని వీధివాసులు కోరారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story