Neerugattupalle: జన్మభూమి కాలనీలో హైడ్రామా.. రంగంలోకి దిగిన పోలీసులు
Neerugattupalle: నీరుగట్టువారిపల్లె జన్మభూమి కాలనీలో ప్రహరీ గోడ కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
Neerugattupalle: జన్మభూమి కాలనీలో హైడ్రామా.. రంగంలోకి దిగిన పోలీసులు
నీరుగట్టువారిపల్లె: జన్మభూమి కాలనీలో ప్రహరీ గోడను అక్రమ కట్టడమంటూ శనివారం మున్సిపల్ సిబ్బంది జేసీబీతో కూల్చివేతకు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటి యజమాని వాసుదేవ, సిబ్బంది మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రిజిస్టర్డ్ స్థలంలో నిర్మించిన ప్రహరీ గోడను హైటెన్షన్ విద్యుత్ లైన్ కింద అక్రమంగా నిర్మించారని అధికారులు పేర్కొనగా, తమకు అన్ని పత్రాలు ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులు పెడుతున్నారని బాధిత కుటుంబం ఆరోపించింది. గోడ కూలిస్తే జేసీబీ కింద పడుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు స్థల సర్వే అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Next Story




