Kanipakam: సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యేలు
Kanipakam: సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 78వ ఆడికృతిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కాణిపాకం ఆలయం తరఫున ఎమ్మెల్యేలు పులివర్తి నాని దంపతులు పట్టు వస్త్రాలు, సారె సమర్పించారు.
Kanipakam: సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యేలు
కాణిపాకం: శ్రీ స్వయంభు వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నుండి ఆనవాయితీగా పట్టు వస్త్రాల సమర్పణ, కాణిపాకం ఆలయము నుండి పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నాను అని పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ అన్నారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఊట్లవారిపల్లి సమీపన ఆనందగిరి పై వెలసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 78వ ఆడికృతిక బ్రహ్మోత్సవాలలో భాగంగా భరణి రోజు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ దంపతులు,చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని,పులివర్తి సుధారెడ్డి దంపతులు కలిసి శ్రీస్వయంభు వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నుండి ఆనవాయితీగా వస్తున్న పట్టు వస్త్రాలను గురువారం సమర్పించారు.
చంద్రగిరి,పూతలపట్టు ఎమ్మెల్యేలు తీసుకువచ్చిన సారెను అంగరంగ వైభవంగా ఆలయ ఈఓ యువరాణి,చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు,కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని నియోజక ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని భగవంతుని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు ఎమ్మెల్యే కు అందించి వేద పండితుల మంత్రోచ్ఛారణతో ఆశీర్వదించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,వారి కుటుంబ సభ్యుల పేరిట స్వామి వారికి ప్రత్యేక అర్చనలు జరిపించినట్లు చంద్రగిరి ఎమ్మెల్యే తెలిపారు.సుభిక్షమైన పాలన సాగాలని,ప్రజలందరూ ఆయురారోగ్యాలు,సుఖశాంతులతో విలసిల్లాలని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీరు,నిత్యాన్నదానం,ఉచిత లడ్డు,ఉచిత మజ్జిగ పంపిణీతో పాటు వాహనాల పార్కింగ్,శాంతిభద్రతల పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
దూర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆనందగిరి కొండంతా "హరోం హర" నామస్మరణతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు,ప్రజా ప్రతినిధులు,పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.




