Nagari: నగరి వాహనదారులకు గుడ్ న్యూస్!
Nagari: నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ కృషితో నగరి, పుత్తూరు ఎంవీఐ కార్యాలయాలకు పూర్తి అధికారాలు.
Nagari: నగరి వాహనదారులకు గుడ్ న్యూస్!
Nagari: నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చొరవతో నగరి నియోజకవర్గ వాహనదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే కృషి ఫలితంగా నగరి, పుత్తూరు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) కార్యాలయాలకు పూర్తి అధికారాలు కల్పించారు.
దీంతో ఇకపై లర్నింగ్ లైసెన్స్ (LLR), డ్రైవింగ్ లైసెన్స్ జారీ, చిరునామా మార్పు, వాహన యాజమాన్య బదిలీ (ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ ) తదితర వ్యక్తిగత సేవలను నగరిలోని ఎంవీఐ కార్యాలయంలోనే పొందే అవకాశం కల్పించారు.
ఇప్పటి వరకు ఈ సేవల కోసం చిత్తూరు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో ఆ అవసరం లేకుండా స్థానికంగానే అన్ని సేవలు అందుబాటులోకి రానుండటంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సేవలను అమలు చేసేందుకు రవాణా శాఖ ఇప్పటికే అవసరమైన చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. నగరి నియోజకవర్గ ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరమైన నిర్ణయమని,ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ కృషి ఫలితంగానే ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని స్థానికులు అభినందిస్తున్నారు.




