Nagari: నగరి 'జగన్ 2.0 యాప్' పోస్టర్లను ఆవిష్కరించిన రోజా
Nagari: నగరిలో వైఎస్సార్సీపీ 'జగన్ 2.0 యాప్' పోస్టర్లను ఆవిష్కరించిన మాజీ మంత్రి ఆర్.కే. రోజా. పార్టీ బలోపేతానికి యాప్ కీలకమని ఆమె పేర్కొన్నారు.
Nagari: నగరి 'జగన్ 2.0 యాప్' పోస్టర్లను ఆవిష్కరించిన రోజా
నగిరి: చిత్తూరు జిల్లా,నగిరి వైఎస్సార్సీపీ కార్యకలాపాలు, ప్రజా సమస్యలు, పార్టీ కార్యక్రమాలను ప్రజలకు వేగంగా చేరవేసే వేదికగా "జగన్ 2.0 యాప్" ఉపయోగపడుతుందని మాజీ మంత్రి, నగరి నియోజకవర్గ సమన్వయకర్త ఆర్.కే. రోజా అన్నారు.
శనివారం నగరిలోని వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో కలిసి "పార్టీకి ప్రజలే బలం – ప్రజలకు వెన్నుదన్నుగా జగన్ 2.0 యాప్" పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, పార్టీ అధికారిక కార్యక్రమాలు, ప్రెస్‌మీట్లు, ప్రజా ఉద్యమాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, పార్టీపై జరుగుతున్న కుట్రలు, నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు సకాలంలో చేరవేయడంలో జగన్ 2.0 యాప్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ జగన్ 2.0 యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. పార్టీకి ప్రజలే బలమని, ప్రజలకు వెన్నుదన్నుగా జగన్ 2.0 యాప్ నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర,జిల్లా, నియోజకవర్గ నాయకులు, మండల,మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షులు,బూత్ కమిటీలు, అనుబంధ కమిటీల ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




