Kuppam: కుప్పంలో నారా భువనేశ్వరి 4 రోజుల పర్యటన!

Kuppam: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జూలై 27 నుండి 30 వరకు సీఎం సతీమణి నారా భువనేశ్వరి పర్యటన.

KUMAR, KUPPAM
Published on: 25 July 2026 8:07 AM IST
Kuppam
X

Kuppam: కుప్పంలో నారా భువనేశ్వరి 4 రోజుల పర్యటన!

Kuppam: సీఎం సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గoలో నాలుగు రోజుల పర్యటన. పూర్తి వివరాలు

తేదీలు: 27-07-2026 నుండి 30-07-2026 వరకు*

జూలై 27, 2026 (సోమవారం)

ఉదయం 9:00 గంటలకు నివాసంలో ప్రజల నుంచి వినతుల స్వీకరణ

9:30 గంటలకు దండికుప్పం మీదుగా కెంచన బల్లకు ప్రయాణం

10:00 గంటలకు యూనిట్ ఇన్‌చార్జి చంద్రారెడ్డి నివాస సందర్శన

10:30 గంటలకు సింగసముద్రం మీదుగా నానియాల ఎకో టూరిజం సెంటర్‌కు ప్రయాణం

11:00 గంటలకు నానియాల ఎకో టూరిజం కేంద్రం సందర్శన, మహిళలతో ముఖాముఖి

మధ్యాహ్నం 1:30 గంటలకు భోజన విరామం

2:00 గంటలకు కావలిమడుగు ఎస్టీ కాలనీకి ప్రయాణం

2:30 గంటలకు ఇంటింటి పర్యటన

3:00 గంటలకు పీఎంకే తండాలో మహిళలతో సమావేశం

4:10 గంటలకు పాండ్యాలమడుగులో మహిళలతో సమావేశం

సాయంత్రం 5:30 గంటలకు రామకుప్పం జెడ్పీ హైస్కూల్‌లో సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించిన డైనింగ్ హాల్ ప్రారంభోత్సవం

అనంతరం నివాసానికి చేరుకుని రాత్రి బస

జూలై 28, 2026 (మంగళవారం)

ఉదయం 10:00 గంటలకు ప్రజల నుంచి వినతుల స్వీకరణ

10:45 గంటలకు కుప్పం 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎస్‌విమ్స్ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం, టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభం

11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ద్రావిడ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో విద్యార్థులతో క్విజ్ కార్యక్రమం

మధ్యాహ్నం 2:30 గంటలకు అగరంలో మహిళలతో సమావేశం

3:45 నుంచి 5:00 గంటల వరకు యామిగానిపల్లిలో శ్రీవారి టెంపుల్ ట్రస్ట్ ఆలయ ప్రతినిధులతో సమావేశం

అనంతరం నివాసానికి చేరుకుని రాత్రి బస

జూలై 29, 2026 (బుధవారం)

ఉదయం 9:30 గంటలకు ప్రజల వినతుల స్వీకరణ

10:30 గంటలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హార్టికల్చర్ హబ్ సందర్శన

11:15 నుంచి 12:45 వరకు వసనాడులో మహిళలతో సమావేశం

12:45 నుంచి 1:15 వరకు వసనాడు పాఠశాలలో మొక్కల నాటడం

1:30 గంటలకు బాబునగర్ దశమేశ్వరి అమ్మవారి ఆలయ దర్శనం

3:30 నుంచి 4:30 వరకు వేపూరులో మహిళలతో సమావేశం

4:45 గంటలకు గరిగచీనేపల్లి జెడ్పీ హైస్కూల్‌లో స్కూల్ చిల్డ్రన్స్ ప్రాజెక్ట్ ప్రారంభం

5:00 నుంచి 6:00 వరకు గరిగచీనేపల్లిలో మహిళలతో సమావేశం

అనంతరం నివాసానికి చేరుకుని రాత్రి బస

జూలై 30, 2026 (గురువారం)

ఉదయం 9:45 గంటలకు హెచ్‌పీ రోడ్డులోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

10:15 గంటలకు పెద్దపల్లి గంగమ్మ ఆలయంలో పూజలు,అనంతరం దివంగత అన్సార్ బాషా, చిన్ని కుటుంబ సభ్యులను పరామర్శ

ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు టీటీడీ కళ్యాణ మండపంలో ఎన్‌టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది.

KUMAR, KUPPAM

KUMAR, KUPPAM

Next Story