Nimmanapalle: జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా మేసా మాలతి ఖరారు!
Nimmanapalle: నిమ్మనపల్లె మండలం ముష్టూరు ఎంపీటీసీ జనసేన అభ్యర్థిగా మేసా మాలతి ఖరారు. పార్టీ ఇన్‌ఛార్జ్ రాందాస్ చౌదరి చేతుల మీదుగా బి-ఫారం స్వీకరణ.
Nimmanapalle: జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా మేసా మాలతి ఖరారు!
నిమ్మనపల్లె: మదనపల్లె నియోజకవర్గంలోని నిమ్మనపల్లె మండలం ముష్టూరు గ్రామ జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా మేసా మాలతి ఖరారయ్యారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ గంగారపు రాందాస్ చౌదరి చేతుల మీదుగా మేసా మాలతి, రమేష్ బి-ఫారం అందుకున్నారు.
ఈ సందర్భంగా మాలతి, రమేష్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ తమపై నమ్మకంతో ఎంపీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు.
పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో ప్రజల్లోకి వెళ్లి మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. ముష్టూరు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, ప్రజల ఆదరణతో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.




