Palamaner: పలమనేరు ఒంటరి ఏనుగు 'కేశవ' బంధనం - సక్సెస్

Palamaner: పలమనేరు అటవీ ప్రాంతంలో ఒంటరి ఏనుగును బంధించిన అధికారులు. 16 ఏళ్ల ఏనుగుకు 'కేశవ్' అని నామకరణం. ముసళ్ళమడుగు ఎలిఫెంట్ క్యాంపుకు తరలింపు.

SUBRAMANYAM, PALAMANERU
Published on: 16 July 2026 5:02 PM IST
Palamaner
X

Palamaner: పలమనేరు ఒంటరి ఏనుగు 'కేశవ' బంధనం - సక్సెస్

పలమనేరు: పలమనేరు జగమర్ల అటవీ ప్రాంతంలోని ఒంటరి ఏనుగును బుధవారం రోజున అటవీ శాఖ అధికారులు బంధించారు. ఐదు కుంకీల సాయంతో మాటు వేసి ఒంటరి ఏనుగును బంధించినట్లు సబ్ డిఎఫ్ఓ వేణుగోపాల్ తెలిపారు.

పది రోజులపాటు ఒంటరి మగ ఏనుగును రప్పించేందుకు దట్టమైన అడవిలో గజరాజుకు సంగటి, గుమ్మడికాయలు, అరటి, కొబ్బరికాయలు, బెల్లం, రాగి ఆకులు, వంటి ఆహారాలు ఏర్పాటు చేసి తినడానికి వచ్చినప్పుడు గన్ సహాయంతో మత్తు ఇంజక్షన్ ను ప్రయోగించి 16 సం" ఒంటరి ఏనుగును పట్టుకున్నారు.

అనంతరం ఆ ఏనుగును ముసళ్ళమడుగు ఎలిఫెంట్ క్యాంపుకు తరలించారు. పట్టుబడిన ఒంటరి ఏనుగుకు కేశవ్ గా నామకరణం చేసినట్లు సబ్ డి ఎఫ్ ఓ తెలిపారు. శిక్షణ ఇచ్చి కుంకిగా మార్చే యోచనలో అటవీ శాఖ అధికారులు ఉన్నట్లు తెలిపారు. మొత్తానికి చిత్తూరు డిఎఫ్ఓ ఆధ్వర్యంలో ఆపరేషన్ టస్కర్ సక్సెస్ అయింది.

SUBRAMANYAM, PALAMANERU

SUBRAMANYAM, PALAMANERU

Next Story